News January 30, 2025

చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

Similar News

News March 2, 2026

విశాఖ: కాంట్రాక్టర్లుగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు..!

image

GVMC ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కొలతలు తీసి ఎం-బుక్ నమోదు కోసం ఏఈలకు అందజేస్తున్నారని సమాచారం. ఏటా రూ.500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్‌లలో ఇదే తీరుగా వ్యవహారం సాగుతోందని విమర్శలున్నాయి. వీరిపై ఫిర్యాదులు చేరినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

News March 2, 2026

HYD: ఇవి తింటే.. గుండె పదిలం

image

ఆరోగ్యకర జీర్ణ ప్రక్రయకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం అవసనమని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుముల వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు రోజువారీ ఆహారంలో చేర్చితే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.

News March 2, 2026

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

image

పెళ్లి తర్వాత విజయ్-రష్మిక బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే PM మోదీ, CM రేవంత్‌ను కలిసిన ఈ కొత్త జంట తాజాగా అల్లు ఇంట సందడి చేసింది. ఈ నెల 6న అల్లు శిరీష్ వివాహం జరగనున్న నేపథ్యంలో నిన్న పెళ్లి కొడుకు వేడుక జరిగింది. దీనికి ‘విరోష్’ జోడీ హాజరైంది. వారిద్దరికీ అల్లు అరవింద్, అర్జున్ సహా కుటుంబ సభ్యులు విషెస్ తెలిపారు. కాగా ఇవాళ అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.