News January 23, 2026
చెన్నూర్: విద్యార్థులతో జిల్లా కలెక్టర్

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండలంలోని కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.
Similar News
News February 5, 2026
MNCL: మహిళలు, బాలికల భద్రతకు అండగా షీ టీమ్స్: CP

మహిళలు, బాలికల భద్రతకు భరోసా, అండగా షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా వేధిస్తే వెంటనే 6303923700, 8712659385 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News February 5, 2026
ANU: స్పెషల్ బీఈడీ పరీక్ష ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నవంబర్ నెలలో జరిగిన స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 16వ తేదీలోపు రూ.1,860 చెల్లించాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in చూడాలన్నారు.
News February 5, 2026
బాపట్ల అధికారులకు కలెక్టర్ సూచనలు

వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. వాణిజ్య పన్నుల వసూలు ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అధికారులు పనిచేయాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు చెందిన పన్నులు పెండింగ్ లేకుండా వసూలు చేయాలన్నారు.


