News February 25, 2026

చెరకులో పీక, కాండం తొలుచు పురుగు కట్టడికి సూచనలు

image

లోతైన కాలువల్లో ముచ్చెలను నాటి, వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడులివ్వాలి. తోటల్లో మొక్క నాటిన 3వ రోజున, కార్శి తోటల్లో కార్శి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారీ చేయాలి. ట్రైకోగ్రామా ఖిలోనిన్ గుడ్డు పరాన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి.

Similar News

News February 27, 2026

మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం?

image

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో BCCI ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని మార్చి 26గా ప్రకటించింది. అయితే అస్సాం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రారంభ తేదీని 28కు మార్చినట్లు క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ఫైనల్ మే 31న జరగనుందని తెలిపింది. కాగా వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

News February 27, 2026

ఎవరీ నటి.? తెగ సెర్చ్ చేస్తున్నారు..

image

ప్రభాస్-సందీప్ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి ఇవాళ <<19254726>>అప్డేట్<<>> వచ్చిన విషయం తెలిసిందే. తాజా పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్‌తో పాటు ఓ నటి ఉన్నారు. గాగుల్స్ ధరించి ఉన్న ఆమె ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ఐశ్వర్య దేశాయ్. ‘గల్లీ బాయ్’ మూవీతో పాటు ర్యాట్ ఇన్ ది కిచెన్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. స్పిరిట్‌లో ఈమె కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

News February 27, 2026

అంగన్వాడీలకు సమ్మర్ హాలిడేస్ పెంపు?

image

AP: అంగన్వాడీలకు సమ్మర్ హాలిడేస్ 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాలు(ప్రస్తుతం అ.టీచర్ల జీతం రూ.11,500) పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని CM దృష్టికి తీసుకెళ్లామని, అంతా మంచే జరుగుతుందన్నారు. ఇక అంగన్వాడీల కృషి వల్లే ‘పోషణ్ అభియాన్‌’లో దేశంలోనే AP అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.