News August 24, 2024
చెరువులకు జలకళ
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలకు ఊరట నిస్తున్నాయి. జోరు వానలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అనంతపురం జిల్లాలో 301, సత్యసాయి జిల్లాలో 1,186 చెరువులు ఉండగా వాటి కింద 1.23 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి సామర్థ్యం 22.978 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు.
Similar News
News January 15, 2025
కాకి అనే ఊరు ఉందని మీకు తెలుసా?
కొన్ని ఊర్ల పేర్లు వింటే ఇవి నిజంగానే ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని ‘కాకి’ అనే గ్రామం కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీని పూర్తిపేరు కాంచన కిరీటి. ఏపీలో చివరి గ్రామంగా, కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది. 2011 జనాభా ప్రకారం ఈ గ్రామంలో 838 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇలా మీకు తెలిసిన గ్రామం పేర్లు ఉంటే కామెంట్ చేయండి.
News January 15, 2025
ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ని కలిసిన కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతిభవనంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కలిశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
News January 14, 2025
ధర్మవరం లాడ్జిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్
ధర్మవరంలోని పీఆర్టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో శివరాఘవ రెడ్డి(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు తీసుకున్న రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. శివరాఘవ రెడ్డి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.