News December 11, 2025
చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.
Similar News
News December 22, 2025
ఫాక్స్‌కాన్ రికార్డు.. ఏడాదిలో 30 వేల మందికి ఉద్యోగాలు!

బెంగళూరులోని ఫాక్స్‌కాన్ 2025లో రికార్డు స్థాయిలో 30 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. వీరిలో 80% మంది మహిళలే. ఇండియాలో ఐఫోన్ల అసెంబ్లీకి కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. నవంబరులో యాపిల్ ఏకంగా 2 బి.డాలర్లు విలువ చేసే ఫోన్లను ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసింది.
News December 22, 2025
ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ 100పోస్టులకు నోటిఫికేషన్

<
News December 22, 2025
మొటిమల మచ్చలు తగ్గట్లేదా?

వాతావరణం, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు తగ్గించడానికి చింతపండు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని కడిగితే చాలు. అలాగే చింతపండు గుజ్జులో అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది.


