News February 5, 2025

చెర్వుగట్టులో ఆటో వాలాల దోపిడీ: భక్తులు

image

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు మండిపడుతున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.

Similar News

News February 5, 2025

నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ 

image

కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 5, 2025

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు 

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News February 5, 2025

NLG: 33 జడ్పీటీసీలు.. 352కు చేరిన ఎంపీసీటీలు!

image

2016లో జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో 31 మండలాలు ఉండగా వాటి పరిధిలో 31 జడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఆ తర్వాత జిల్లాలో రెండు మండలాలను పెంచారు. గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో జడ్పీటీసీలు కూడా 33 కానున్నాయి. ఎంపీటీసీల పునర్విభజన చేపట్టడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 352కు చేరింది.

error: Content is protected !!