News February 5, 2025
చెర్వుగట్టులో కట్నాల రాబడి రూ.8.89 లక్షలు
చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు సమర్పించిన కట్నాలు సాయంత్రం 4 గంటల వరకు లెక్కించగా రూ.8,89,445లు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు.
Similar News
News February 5, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కేశరాజుపల్లికి చెందిన మేకల మహేశ్ (25) పొలం వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో హ్యాపీ హోమ్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News February 5, 2025
నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్
కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.