News February 1, 2025

చెర్వుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!

image

చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.

Similar News

News October 31, 2025

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నమ్ముతా: ఉప రాష్ట్రపతి

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని దేవర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తమిళనాడులోని పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. “నేతాజీకి దేవర్ బలమైన మద్దతుదారుడు. ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ చెప్పారు. నేను అదే నమ్ముతాను” అని తెలిపారు.

News October 31, 2025

GNT: తెలుగులో ఏపీ రాజకీయ చరిత్ర రచించిన గొప్ప వ్యక్తి

image

రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు తెలుగులో రచించిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబర్ 31న చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్‌ రచనలు ఆయన తెలుగులో అనువదించగా, తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు. ఈయన జాతీయ హేతువాద సంఘంకి కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1954 నుంచి పదేళ్ల పాటు “ప్రజావాణి” పత్రికలో పనిచేశారు.

News October 31, 2025

మంత్రివర్గంలోకి మరో ఇద్దరు!

image

TG: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఇవాళ మ.12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. DEC తర్వాత మరో ఇద్దరు క్యాబినెట్‌లో చేరుతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. దీనిపై CM రేవంత్ రెడ్డి, అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో BRSను గెలిపించడమే ఆ పార్టీ లక్ష్యమని మహేశ్ ఆరోపించారు.