News August 9, 2025

చెల్లిపోని బంధం మీదమ్మా!

image

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.

Similar News

News August 9, 2025

రాఖీ ఎప్పటి వరకు ఉంచుకోవాలంటే?

image

రక్షాబంధన్ రోజు కట్టిన రాఖీని దసరా వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి(ఆగస్టు 16) వరకైనా ధరించాలి. ఆ తర్వాత దానిని నది, చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసివేసేటప్పుడు ఎలాపడితే అలా తెంచి వేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప్పి తీసివేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల సోదర బంధం బలపడుతుందని, శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు అంటున్నారు.

News August 9, 2025

వంజంగిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

image

పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. తొలుత వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం కాఫీ తోటలను సందర్శించారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయన వెంట మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ఇతర అధికారులున్నారు.

News August 9, 2025

MDK: 19 అడుగుల నీటిమట్టానికి పోచారం ప్రాజెక్టు

image

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు 19 అడుగుల నీటిమట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. వర్షాలకు ప్రాజెక్ట్ నిండుకోవడంతో అన్నదాతలు సంతోషిస్తున్నారు. రాఖీ సెలవులు కావడంతో పర్యాటకులు వస్తున్నారు.