News August 9, 2025
చెల్లెలి కోసం గుడి కట్టి ఆమె విగ్రహానికి పూజలు.!

చెల్లెలిపై ప్రేమతో ఆస్తులు, అంతస్తులు ఇచ్చిన ఘటనలు చూసింటాం. కానీ అకాల మరణం చెందిన చెల్లెలు కోసం గుడి కట్టిన ఘటన ఇది. వెంకటాచలం(M) కాకుటూరుకు చెందిన చెంచయ్య, లక్ష్మమ్మకు 5గురు సంతానం. వారిలో శివ ప్రసాద్, సుబ్బలక్ష్మి 2011లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సుబ్బలక్ష్మి చనిపోగా, శివ కోలుకున్నారు. చెల్లెలిని మరిచిపోలేని అన్న ఏకంగా గుడి కట్టి, చెల్లెలి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేస్తున్నారు.
Similar News
News August 9, 2025
పెంచలకోన ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్

రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం పాలకమండలి నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎట్టకేలకు 8 ఏళ్ల తరువాత దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 20 రోజుల్లోపు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
News August 9, 2025
నెల్లూరు: పలు దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్

నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.
News August 8, 2025
నెల్లూరులో డిజైన్స్ బట్టి అదిరిపోయే రేట్లు

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా భావించే రాఖీ పండగ సందడి నెల్లూరులో మొదలైంది. ఎటు చూసినా అందమైన డిజైన్ల రాఖీలే దర్శనమిస్తున్నాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో నెల్లూరులోని పలు దుకాణదారులు రాఖీల రేట్లు అమాంతం పెంచేశారు. రూ.30 నుంచి రూ.500 వరకు రాఖీల రేట్లు ఉన్నాయి. వెండి రాఖీలు సైతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.