News September 4, 2025
చేగుంట వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన

చేగుంట వద్ద వడియారం, మాసాయిపేట స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నెం. 228 స్థానంలో ఆర్‌ఓబీ, ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణానికి ఈనెల 4న ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, అంజిరెడ్డి, కొమురయ్య, రైల్వే అధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. దీంతో ఆర్ఓబీ ట్రాఫిక్ సమస్య తీరనుంది.
Similar News
News September 5, 2025
విశాఖలో రూ.5.25 కోట్ల భారీ మోసం

స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో విశాఖలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ద్వారకానగర్‌కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
News September 5, 2025
‘ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సహాయక బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు ఈనెల 7న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపైన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,186 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు.
News September 5, 2025
రాజమండ్రి: జిల్లాలో 87 మంది ఉపాధ్యాయులకు అవార్డులు

జిల్లా పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆనం కళాకేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను వారు కొనియాడారు.