News October 2, 2024
చేజర్ల ఎమ్మార్వో నుంచి రూ.3.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

చేజర్ల తహశీల్దార్‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
నెల్లూరు: పరీక్షలా? క్రికెట్ మ్యాచ్‌లా?

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
News February 16, 2026
నెల్లూరు: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 50, గూడూరు డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470
News February 16, 2026
ఉదయగిరి జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


