News March 27, 2024
చేనేతలకు 500 యూనిట్ల కరెంట్ ఫ్రీ: CBN

పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Similar News
News April 21, 2025
తిరుపతి SVU పరీక్షలు వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
News April 21, 2025
చిత్తూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,478 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-578 ➤ BC-A:111 ➤ BC-B:139
➤ BC-C:19 ➤ BC-D:102 ➤ BC-E:53
➤ SC- గ్రేడ్1:21 ➤ SC-గ్రేడ్2:94 ➤ SC-గ్రేడ్3:112
➤ ST:95 ➤ EWS:138
➤ PH-విజువల్:1 ➤ PH- హియర్:10
➤ ట్రైబల్ వెల్ఫేర్ :5
News April 21, 2025
మే 6 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న అమ్మవారి జాతర జరగనుంది. 14న ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. పుష్ప-2లోనూ ఈ జాతర ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే