News April 4, 2024
చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు..?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 103 చేనేత, జౌళి సంఘాలు ఉన్నాయి. వీటిలో 13 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు చివరిసారిగా 2013 ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీకాలం గడువు 2018 ఫిబ్రవరి 10 నాటికి ముగిసింది. అప్పటినుండి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు.
Similar News
News November 3, 2025
హన్వాడ: సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది

యాదవులు జరుపుకునే సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హన్వాడ మండలం కేంద్రంలో సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతులకు నిలయంగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించారు.
News November 2, 2025
MBNR: అక్టబర్‌లో 21 రెడ్‌హ్యాండెడ్ కేసులు

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్‌హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్‌స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
News November 2, 2025
MBNR: జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల అప్పగింత

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ‘AHTU’ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు, కళాశాలలు, గ్రామాల్లో ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు. అధికారులు 30 హాట్‌స్పాట్ ప్రాంతాలను సందర్శించి సమాచారాన్ని సేకరించారు. కురుమూర్తి జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను గుర్తించి తమతమ కుటుంబాలకు అప్పగించారు.


