News February 23, 2025
చేన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

చేన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.
Similar News
News February 20, 2026
NZB: నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.
News February 20, 2026
HYD: 60% వరకు రాయితీతో బైకులు

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.