News November 15, 2025

చేపల సాగులో ఆదర్శంగా నిలిచిన విజయ కుమారి

image

బాపట్ల జిల్లా నగరం మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన ఆక్వా రైతు విజయకుమారి పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా చేపల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ లబ్ధి పొందుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా తక్కువ నీటితో నాణ్యత గల చేపలను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారని పేర్కొంది. పలువురు ఆక్వా రైతులకు ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడింది.

Similar News

News December 8, 2025

చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

image

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.

News December 8, 2025

సిరిసిల్ల: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

image

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం పాటి సురేందర్(44) భోజనం చేస్తుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

News December 8, 2025

రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

image

రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో కుక్కలు వెంటపడ్డాయి. ఈక్రమంలో అతను అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్(42)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.