News May 12, 2024
చేబ్రోలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మండల పరిధిలోని నారాకోడూరు గ్రామం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. మృతుడు వట్టి చెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తిరుపతయ్య(64)గా గుర్తించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
గుంటూరు: 10th విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈనెల 17 నుంచి 31వరకు పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి రవికాంత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ని కండక్టర్‌కి చూపించి తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ అవకాశం కల్పించామన్నారు. దీనిపై మీ కామెంట్.
News March 14, 2025
మద్దతు ధరలకు రబీ పంటల కొనుగోలు: జేసీ

గుంటూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో పండించిన మినుములు, శనగలు, పెసలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు జేసీ భార్గవ్ తేజ గురువారం తెలిపారు. మినుములకు క్వింటాలుకు రూ.7,400లు, శనగలు రూ.5,650లు, పెసలు రూ.8,682లు కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ-క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించదలుచుకుంటే ఈనెల 15వ తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News March 14, 2025
పిల్లలతో అన్ని సమస్యలు గురించి చర్చించాలి: DMHO

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు స్నేహపూరితమైన వాతావరణంలో పిల్లలతో అన్ని సమస్యలు గురించి చర్చించాలని, అప్పుడే పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారన్నారు. తద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు.