News November 20, 2024
చేబ్రోలు: ప్రమాదంలో తండ్రి మృతి.. విలపించిన కుమారుడు
నారా కోడూరు-చేబ్రోలు మధ్యలో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ బండారుపల్లి శ్రీనివాసరావు(42) అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసరావు కుమారుడు విజయవాడలో చదువుకుంటున్నాడు. సెలవు తీసుకొని తండ్రితో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చూస్తుండగానే తండ్రి మృతి చెందడంతో అతను గుండెలవిసేలా రోదించాడు. ఈ దృశ్యం అందరి హృదయాలను కలిచివేసింది.
Similar News
News January 29, 2025
కుష్టు వ్యాధిగ్రస్తులు సంఖ్య తగ్గుతుంది: DMHO
గుంటూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్స్ (LCDC)ని తమిళనాడుకు చెందిన LCDC మానిటరింగ్ టీమ్ అధికారులు రంగనాథ్, అక్షర్ పురోహిత్ మంగళవారం పరిశీలించారు. ఈమని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సభ్యులు ఈ సందర్భంగా పరిశీలన చేశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మీ తన ఛాంబర్‌లో కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులు సంఖ్య తగ్గుతుందన్నారు.
News January 28, 2025
లింగనిర్థారణ చేస్తే 3 నెలల జైలు: లీలావతి
గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంగళవారం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి అతిథిగా హాజరై ప్రసంగించారు. లింగ నిర్థారణ చట్టపరంగా నేరమని, సమాజంలో ఆడ, మగపిల్లలను సమానంగా చూడాలని అన్నారు. లింగ నిర్థారణ చేస్తే 3 సంవత్సరాలు రూ.50 వేల జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
News January 28, 2025
పెదకాకాని: ట్రైన్ కిందపడి పాలిటెక్నిక్ స్టూడెంట్ మృతి
పెదకాకాకానిలో పాలిటెక్నిక్ స్టూడెంట్ రైలు కిందపడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. హారిక (17) నారా కోడూరులోని ఓ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతోంది. గత కొద్ది రోజుల హారిక మానసికంగా బాగోలేక కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లేది కాదు. సోమవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ట్రైన్ కిందపడి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.