News December 20, 2024

చేబ్రోలు VRA అనుమానాస్పద మృతి.. ట్విస్ట్ ఇదే.!

image

చేబ్రోలు(M) కొత్తరెడ్డి పాలెంలో వీఆర్ఏ అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ మృతిచెందడంతో దహనం చేసేందుకు VRA పెదఏబు, మరో మహిళ VRA హేమలత, ఏసుదాసు అనే వ్యక్తి శ్మశాన వాటికకు వచ్చారు. దహనం అనంతరం వచ్చిన రూ.3,500 నగదు పంపకంలో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ VRA హేమలత ఏబు తలపై బండ రాయితో కొట్టగా మరణించాడు.

Similar News

News September 14, 2025

గుంటూరు: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణరావు

image

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎన్నికయ్యారు. విజయనగరంలో జరుగుతున్న 18వ ఏపీ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక మహాసభలలో ఆయన ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కశాకర్, యుటీఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయుకులు, తాదితర సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సన్మానం నిర్వహించారు.

News September 14, 2025

ప్రముఖ శాస్త్రవేత్త రోహిణీప్రసాద్ మన తెనాలి వారే

image

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, కొడవటిగంటి రోహిణీప్రసాద్ 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రేడియో యాక్టివిటీ పరికరాలపై పరిశోధన మీద బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు.

News September 14, 2025

సంగీత దర్శకుడు శ్రీ మన గుంటూరు జిల్లా వారే

image

సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13న జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు కె. చక్రవర్తి 2వ కుమారుడు. 1993లో గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల రాసిన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. సింధూరం చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం.