News March 9, 2025
చేర్యాల: రెండు రోజుల్లో పెళ్లి.. యువకుడి పరార్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన యువతికి, జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహ నిశ్చయం జరిగింది. ఈనెల 8న చేర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే 2 రోజుల క్రితం యువకుడు మరో యువతితో ఉడాయించాడు. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి నిలిచిపోవడంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News February 24, 2026
KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.
News February 24, 2026
విండీస్ గెలుపుతో టెన్షన్‌లో టీమ్‌ఇండియా

T20 WC సూపర్-8లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిన ఇండియా ఇప్పుడు తన తదుపరి మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. విండీస్ కొట్టిన భారీ స్కోరు, మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల భారత్ ఒత్తిడిలో పడింది. ఇకపై జరిగే మ్యాచుల్లో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News February 24, 2026
కామారెడ్డిలో జాబ్ మేళా

కామారెడ్డిలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.


