News October 23, 2025
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. యాలాల వాసులు మృతి

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 23, 2025
రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.
News October 23, 2025
రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాధారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.
News October 23, 2025
ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్తు వాహనాలే

AP: RTCలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై CM CBN APSRTCకి ఆదేశాలిచ్చారు. ప్రతి 30 KMకి 1 ఛార్జింగ్ స్టేషన్, ఈ-మొబిలిటీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి 100 ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. E-VEHICLE ప్రాజెక్టు కోసం ₹500 CR ఇవ్వనున్నారు. కేంద్ర ‘PM E-DRIVE’ స్కీమ్ కింద ఉన్న ₹10,900 కోట్ల ఫండ్‌ను అందిపుచ్చుకొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.