News April 28, 2024
చేవెళ్ల లోక్‌సభ స్థానంలో డబుల్ పేర్లతో గుబులు!

డబుల్ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. చేవెళ్ల మండలం ధర్మసాగర్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. AIFB నుంచి కర్మన్‌ఘాట్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ వేయగా.. ఇదే పేరుతో దుండిగల్‌కు చెందిన రంజిత్‌రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు.
Similar News
News February 28, 2026
HYDలో అవినీతి ‘సిస్టమ్’ మారేనా?

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!
News February 28, 2026
HYDలో కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఆదివారం..!

గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు పన్ను సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తారు.
News February 28, 2026
HYD: ఇలా అడ్డంగా దొరికిపోయారు!

చెరువు ప్రక్షాళన పనులకు సంబంధించిన ₹1.40 కోట్ల బిల్లు పాస్ చేయాలంటే కూకట్‌పల్లి SE చల్లా చిన్నారెడ్డి ఏకంగా ₹15 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయాడు. దుండిగల్‌లో బిల్డింగ్ పర్మిషన్ కోసం లక్షల్లో లంచం ఆశించిన అధికారి బుక్కయ్యాడు. ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని బండ్లగూడ ఘటన నిరూపించింది. ప్రైవేట్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ పర్మిషన్ ఫైల్‌ను ముందుకు కదపాలంటే <<19262574>>₹10K<<>> అడిగిన జూ.అసిస్టెంట్ శివప్రసాద్‌ను వదలలేదు.


