News March 28, 2025
చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్‌కు సాహిత్య అకాడమీ అవార్డు

చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఇదే కథల సంపుటిని షోలాపూర్‌కు చెందిన బుధవారం రేణుక ‘ఆనందం’ పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు. కథల సంపుటిలోని ఆనంద అనే మొదటి కథను మహారాష్ట్రలోని షోలాపూర్ విశ్వవిద్యాలయంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేశారు.
Similar News
News March 31, 2025
రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు

AP: నేటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ మోస్తరు వర్షాలు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు TGలో కూడా ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
News March 31, 2025
ఆదిలాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
పోలీస్ స్టేషన్‌గా మారిన వికారాబాద్ RDO ఆఫీస్

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్‌గా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు పోలీస్ కార్యాలయంగా మార్చారు. ఆదివారం సెలవు ఉండడంతో షూటింగ్ కోసం అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆఫీస్‌ను ఇలా పోలీస్ స్టేషన్‌గా మార్చేశారు.