News December 25, 2025

చైనా మాంజాపై అమ్మితే కఠిన చర్యలు: ASF ఎస్పీ

image

చైనా మాంజా అత్యంత ప్రాణాంతకమని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. వాహనదారులకు ఇది తీవ్ర ప్రమాదమని తెలిపారు. చైనీస్ మాంజా అమ్మకం, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని.. ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని వివరించారు. ఎవరైనా జిల్లాలో మాంజా అమ్మితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Similar News

News December 29, 2025

ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> హాస్పిటల్, కలబురగి 6 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BDS, MBBS, MD, MSc(మెడికల్ ఫిజియాలజీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం ప్రొఫెసర్‌కు రూ.2,34,630, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,56,024, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,34,046 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 29, 2025

GWL: వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

image

నూతన సంవత్సర 2026 వేడుకలు శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు నిబంధనలు విధించామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగంగా మద్యం సేవించడం, ర్యాలీ, డీజీలు వినియోగించడం నిషేధించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News December 29, 2025

WGL: రాంకీ ఇన్ ఫ్రాలో 102 ఎల్ఐజీ ఫ్లాట్లు

image

వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అల్పాదాయ వర్గాల కోసం ఎల్‌ఐజీ 102 ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చినట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ సి.వి.రమణారెడ్డి, కార్యదర్శి ఎస్.విమల తెలిపారు. కొనుగోలు ఆసక్తి ఉన్న వారు జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్లాట్లను 8న లాటరీ విధానంలో కేటాయిస్తామని అన్నారు. ఈ ఫ్లాట్ల గూర్చి రాంకీ ప్రాజెక్టు సైట్ వద్ద మంగళవారం అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు.