News December 25, 2025
చైనా మాంజా వాడితే జైలుకే: సీపీ హెచ్చరిక

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేందుకు ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇలాంటి మాంజాతో పక్షులతో పాటు ప్రాణికోటికి, వాహనదారులకు తీవ్ర ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, యువత పర్యావరణహితమైన దారాలను మాత్రమే వాడాలని, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ సూచించారు.
Similar News
News December 31, 2025
మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.
News December 31, 2025
మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే!

మార్కాపురంను జిల్లాగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నూతన జిల్లా పరిధిలో ఉండే 21 మండలాలు.. గిద్దలూరు, బి పేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థ వీడు, మార్కాపురం, తర్లుపాడు, వైపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతుని పాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లో పల్లె, చంద్రశేఖరపురం, పామూరు మండలాలు ఉండనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
News December 31, 2025
జనవరి 17 నుంచి ‘సీఎం కప్’ క్రీడా పోటీలు

హైదరాబాద్: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్ 2025’ క్రీడా పోటీలు జనవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయుల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, ఫొటోతో https://satg.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.


