News February 3, 2025
చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్
0-5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 38 వేల వరకు పెండింగ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.
Similar News
News February 3, 2025
కంకిపాడుకి చెందిన బాలుడిపై కేసు నమోదు
కంకిపాడుకి చెందిన బాలుడిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. గుంటుపల్లికి చెందిన ఓ బాలిక కంకిపాడుకు చెందిన బాలుడిని ప్రేమించింది. ఈ క్రమంలో లైంగికంగా కలిసినట్లు బాలిక ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాలుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News February 3, 2025
విజయవాడ: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025
News February 3, 2025
కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
మచిలీపట్నం-పెడన హైవేలో హర్ష కాలేజ్ సమీపంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.