News June 22, 2024
చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, తన భార్య కలిసింది ఇక్కడే

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే, రూపాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు యోజిత్ (11), రుషికశ్రీ(8). కాగా ఆమె ఉపాధ్యాయురాలు. రెండు నెలల క్రితమే వారు హైదరాబాద్‌కు రాగా ఈ ఘటన జరిగింది.
Similar News
News February 10, 2026
జమ్మికుంటలో ఓటుకు రూ.10 వేలు?

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఓటు విలువపై చర్చ వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఒక్క ఓటుకు రూ.10 వేలు, 25కిలోల రైస్ బ్యాగ్ అందిస్తున్నారని పట్టణమంతా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మహిళా ఓటర్లే లక్ష్యంగా నగదు రూ.5వేలు, వెండి కుంకమ భరణి, చీరలు బహుమతులుగా అందిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక రికార్డు బ్రేక్ చేస్తూ జరిగే మున్సిపల్ ఎన్నికలతో రాత్రికి రాత్రే అభ్యర్థుల భవిష్యత్ మారనుంది.
News February 10, 2026
ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని పోలింగ్ కేంద్రం వద్ద చూపాలని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.
News February 10, 2026
కరీంనగర్‌లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.


