News February 24, 2025
చొప్పదండి: కారు ఢీకొని యువకుడి మృతి

చొప్పదండి పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి కారు ఢీకొని ఒడ్నాల రమేష్ ( 22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రమేష్ అవివాహితుడు. పట్టణంలోని హోటల్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతుని తండ్రి గతంలోనే మరణించగా తల్లి కరీంనగర్లో కూలీ పని చేస్తూ జీవిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News February 24, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా…

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.5°C నమోదు కాగా, జమ్మికుంట 37.8, మల్యాల, ఈదులగట్టేపల్లి 37.7, నుస్తులాపూర్ 36.8, గంగిపల్లి, పోచంపల్లి 36.3, కొత్తపల్లి-ధర్మారం 35.6, వీణవంక 35.4, గట్టుదుద్దెనపల్లె 35.3, గంగాధర 35.1, ఇందుర్తి 35.0, కరీంనగర్ 34.9, తాడికల్ 34.7, వెదురుగట్టు 34.6, గుండి 34.4°C గా నమోదైంది.
News February 24, 2025
KNR: నేడు ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నేడు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని తెలిపారు.
News February 24, 2025
కరీంనగర్: గం‘జాయ్’లో యువత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.