News September 15, 2025
చొప్పదండి: పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కరీంనగర్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడని, ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం అతడిని తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.
News September 15, 2025
ఆరోగ్య మహిళ.. శక్తివంతమైన కుటుంబం: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లాలో ‘ఆరోగ్య మహిళ.. శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రాథమిక, అర్బన్, బస్తీ దవాఖానాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
News September 15, 2025
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.