News August 25, 2025
చొప్పదండి: వృద్ధురాలిని రక్షించిన ఫైర్ సిబ్బంది

చొప్పదండి పట్టణంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఓ వృద్ధురాలిని ఫైర్ అధికారులు కాపాడిన ఘటన సోమవారం జరిగింది. స్థానిక 13వ వార్డుకు చెందిన పంచల భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు అనుకోకుండా బావిలో పడింది. విషయం తెలిసిన వెంటనే చొప్పదండి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పవన్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది రెస్కు ఆపరేషన్లో భాగంగా తాళ్ల సాయంతో వృద్ధురాలిని
క్షేమంగా బయటికు తీశారు. ఈ సందర్భంగా పలువురు ఫైర్ సిబ్బందిని అభినందించారు.
Similar News
News August 25, 2025
కేటీఆర్.. అప్పుడు మీ దమ్ముకు ఏమైంది?: MP కిరణ్

TG: పార్టీ మారిన MLAలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ KTR విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ MP చామల కిరణ్ కౌంటరిచ్చారు. ‘పదేళ్లలో 60 మంది MLAలు పార్టీ మారితే అప్పుడు మీ దమ్ముకు దుమ్ము పట్టిందా? మీరు HYDలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా పార్లమెంట్‌లో సున్నా వచ్చింది’ అని అన్నారు. BJPని విమర్శిస్తూ ‘కేంద్రం చంద్రబాబుకు ఇచ్చే ఇంపార్టెన్స్ BJP MPలకు ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News August 25, 2025
విశాఖ జిల్లాలో 5,616 స్మార్ట్ కార్డులు పంపిణీ: జేసీ

జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.
News August 25, 2025
నెల్లూరు చేరుకున్న మంత్రి అనగాని

నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బొకే అందించి స్వాగతం పలికారు. జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఆయన్ను కలిశారు.