News October 14, 2025

చోడవరంలో 275 కిలోల గంజాయి పట్టివేత

image

చోడవరం వద్ద పోలీసులు 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి జిల్లా తర్లగూడకు చెందిన వంతల దేవదాస్ ఒడిశా చిత్రకొండ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలించేందుకు యత్నించాడు. ఎనిమిది సంచుల్లో ప్యాక్ చేసిన గంజాయి, కారు, రెండు బైక్‌లు, ఐదు ఫోన్లు స్వాధీనం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

Similar News

News October 14, 2025

మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులు: DEO

image

మెగా DSC ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించినట్లు DEO రాజ్ కుమార్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు 97 మంది, 103 మంది ఎస్జీటీలు జాయిన్ అయ్యారు. సాలూరులో 39, బలిజిపేటలో 20, గుమ్మలక్ష్మిపురంలో 18, గరుగుబిల్లిలో 8, జియ్యమ్మవలసలో 21, కొమరాడలో 9, కురుపాంలో 21, మక్కువలో 14, పాచిపెంటలో 28, పార్వతీపురంలో 19, సీతానగరంలో ముగ్గురు విధుల్లో చేరినట్లు చెప్పారు.

News October 14, 2025

ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కాలం!

image

ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ‘దామోదర మాసం’గా పరిగణిస్తారు. ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలమని భాగవతంలో ఉంది. ద్వాపర యుగంలో ఈ సమయంలోనే యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ని రోలుకు కట్టేసిన లీల జరిగింది. ఈ క్రమంలో దామమును(తాడును), ఉదరానికి కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. ఈ పవిత్ర మాసంలో ఆయనను ‘దామోదర’ అనే నామంతో ఆరాధిస్తే అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

News October 14, 2025

SBIలో 63 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

SBIలో 63 మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ లేదా MBA/ PGDBA/ PGDBM/ CA/ ICWA/CFA, B.E/B.Tech/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు ₹750, SC, ST, PwBD ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/