News December 28, 2024

చోడవరం: మేనల్లుడిని హత్య చేసిన మేనమామ

image

చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. ప్రేమ కుమార్‌ను మద్యం మత్తులో ఉన్న దుర్గ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 20, 2025

రక్షణే లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు: కమిషనర్

image

ఆపరేషన్ లంగ్స్-2.0తో పాదచారుల భద్రత, వాహనదారుల రక్షణ లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు చేపడుతోందని కమీషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లు, జంక్షన్లపై అనధికార వ్యాపారాలు, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోబడతాయన్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసినవారికి వెండింగ్ జోన్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆక్రమణల రహిత పరిశుభ్రమైన నగరం కోసమే ఈ కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

News September 20, 2025

9 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి: వీఎంఆర్డీఏ ఛైర్మన్

image

మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల కోసం కూడా వుడా పార్కులో స్టేట్ బోర్డు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అడివివరం- శొంఠ్యాం, శొంఠ్యాం-గుడిలోవ పనులను పరిశీలించారు.

News September 20, 2025

విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సుపై సమీక్ష

image

విశాఖలో ఈ నెల 22,23న జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుపై ఐటి విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం సమీక్షించారు. రెండు రోజుల సదస్సుకు వెయ్యి మంది ప్రతినిధులు వస్తారన్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సదస్సు జరగనున్న హోటల్ వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.