News February 13, 2025

చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

Similar News

News February 13, 2025

వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 13, 2025

కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

image

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.

News February 13, 2025

పార్వతీపురం: ఇద్దరు పంచాయతీ రాజ్ AEలు సస్పెన్షన్

image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, పనుల్లో ప్రగతి లేకపోవడంతో ఇద్దరు పంచాయతీ రాజ్ సహాయ ఇంజినీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. గత మూడు నెలలుగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో ఎటువంటి ప్రగతి కనిపించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

error: Content is protected !!