News August 28, 2025

చౌటకూర్: జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా

image

భారీ వర్షాల కారణంగా సుల్తాన్‌పూర్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల రీషెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు.

Similar News

News August 29, 2025

NZB: క్రీడా పోటీలు రద్దు

image

క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

News August 29, 2025

ADB: వినాయకుడిని దర్శించుకున్న గోమాత

image

భీంపూర్ మండలం అంతర్గాంలో త్రినేత్ర గణేష్ మండలి వద్ద హారతి తర్వాత ఓ విచిత్ర ఘటన జరిగింది. అటుగా వచ్చిన ఓ ఆవు, దాని దూడ వినాయకుడి విగ్రహం ముందు నిలబడి భక్తితో చూస్తున్నట్లు కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువకులు వాటికి నైవేద్యం సమర్పించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్వతి పుత్రుడు గణపతిని మురిపెంగా చూస్తూ ఆవు దూడలు అలా దర్శనం చేసుకుంటున్నట్లు కనిపించాయి.

News August 29, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్

image

అమెరికా టారిఫ్ ఆంక్షలు విధించినా భారత్ మాత్రం వెనుకడుగు వేయట్లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు మరింత పెంచేందుకు సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆగస్టుతో పోల్చితే వచ్చే నెలలో 10-20% అదనంగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడులతో మాస్కోలో రిఫైనరీలు దెబ్బతినగా ధరలు కూడా తగ్గే అవకాశమున్నట్లు సమాచారం. పశ్చిమదేశాల ఆంక్షలతో రష్యాకు భారత్ అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారుగా మారింది.