News April 29, 2024
చౌటుప్పల్‌కు మోదీ రాక..!

నల్గొండ, భువనగిరి స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన సభ చౌటుప్పల్‌లో ఖరారైంది. మే నెల 3న లేదంటే 7, 8 తేదీల్లో ఒక రోజు సభ ఉండే అవకాశం ఉందని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. ఆ మేరకు మే నెల మొదటి వారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.
Similar News
News January 2, 2026
అంతా సిద్ధంగా ఉండాలి: నల్గొండ ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్

పురపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
News January 2, 2026
ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.
News January 2, 2026
జిల్లా కలెక్టర్‌ను కలిసిన నల్గొండ ఎస్పీ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎస్పీ మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలపై వారు క్లుప్తంగా చర్చించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొని కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.


