News April 14, 2025

చౌటుప్పల్: పేకాట రాయుళ్ల అరెస్ట్

image

చౌటుప్పల్‌లో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని రాంనగర్ కాలనీ శివారులో ఆరుగురు జూదం ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5,800 నగదుతో పాటు ప్లేయింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 3, 2026

కేయూ ఇయర్ వైస్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు శుభవార్త

image

కాకతీయ విశ్వవిద్యాలయం ఇయర్ వైస్ విద్యార్థులకు బ్యాక్ లాగ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తూ విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ వెంకయ్య నోటిఫికేషన్ జారీ చేశారు. బీఏ, బీఎస్సీ ,బీకాం, బీబీఎం, బీసీఏ( నాన్ ప్రొఫెషనల్) ఏడాది బ్యాక్ లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 31 లోపు ఒక్కో పేపర్‌కు రూ.4 వేల చొప్పున కళాశాలల ద్వారా వర్సిటీ పరీక్షల విభాగంలో చెల్లించాలని తెలిపారు.

News January 3, 2026

సభా సమరం.. కృష్ణా జలాలపై ఇవాళ చర్చ!

image

TG: కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో ఇవాళ షార్ట్ డిస్కషన్ జరగనుంది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ 12PMకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 4 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది.

News January 3, 2026

ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

image

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్‌కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్‌లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.