News December 8, 2025

చౌటుప్పల్ సమీపంలో భారీగా మద్యం పట్టివేత

image

చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News December 8, 2025

NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

News December 8, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి

News December 8, 2025

ఖమ్మం: తొలి విడత పోరుకు 1,562 బ్యాలెట్ బాక్సులు

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశలో 7 మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు,1,740 వార్డులకు ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 20 మంది సర్పంచ్‌లు,158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 1,582 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,582 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిపి, 2 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.