News February 6, 2026

చౌడు నేలల్లో పంటలకు యూరియా ఇలా వేస్తే మేలు

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.

Similar News

News February 20, 2026

నేను సంపాదిస్తాను.. నువ్వు క్రికెట్ ఆడు: వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ

image

టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సక్సెస్ వెనక భార్య నేహా ఖేడేకర్ త్యాగం మరువలేనిది. వీరిద్దరి లవ్‌స్టోరీ SRM వర్సిటీలో మొదలైంది. ఆర్కిటెక్ట్ జాబ్ వదిలేసి క్రికెట్ వైపు వెళ్లాలని వరుణ్ అనుకున్నప్పుడు నేహ కొండంత అండగా నిలిచారు. ‘నీకు జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను సంపాదిస్తాను. నువ్వు క్రికెట్ ఆడు’ అని ధైర్యమిచ్చారు. భవిష్యత్తుపై భరోసా లేక తనను వివాహం చేసుకోవద్దని వరుణ్ చెప్పినా ఆమె వినలేదట.

News February 20, 2026

ఏలియన్స్ ఉన్నాయా? సీక్రెట్స్ బయటపెట్టాలని ట్రంప్ ఆదేశం

image

ఏలియన్స్ ఉన్నాయంటూ <<19147596>>ఒబామా<<>> చేసిన వ్యాఖ్యలను ట్రంప్ మరింత ఆసక్తికరంగా మార్చారు. గ్రహాంతరవాసులు, UFO, UAPలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. చాలా క్లిష్టమైన, ముఖ్యమైన ఈ సమాచారంపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉందని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలియన్స్ ఉన్నాయో.. లేదో.. తనకు మాత్రం తెలియదన్నారు.

News February 20, 2026

పుచ్చ పంటను సాగు చేస్తున్నారా?

image

వేసవిలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చాలా మంది రైతులు పుచ్చను సాగు చేస్తున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. రాత్రి చలి వల్ల బూజు, బూడిద తెగులు.. అలాగే పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలకు పంటలో తామరపురుగు వంటి రసం పీల్చే పురుగులు, పండు ఈగ ఆశించి నష్టం కలిగించే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో మేలైన యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.