News December 29, 2025

ఛాంపియన్‌‌గా సూర్యాపేట

image

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురుషుల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో సూర్యాపేట జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో గద్వాల జట్టుపై 12 పాయింట్ల ఆధిక్యంతో సూర్యాపేట ఘనవిజయం సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నర్సింహారావు క్రీడాకారులను అభినందించారు. జట్టును విజయపథంలో నడిపించిన కోచ్‌ నరసింహారావును ప్రశంసించారు.

Similar News

News December 29, 2025

నాగర్ కర్నూల్‌లో నేటి ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను అదనపు కలెక్టరు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 29, 2025

పెద్దపల్లి: ట్రాన్స్‌జెండర్‌లకు స్వయం ఉపాధి అవకాశాలు: కలెక్టర్

image

పెద్దపెల్లి జిల్లాలో నివసిస్తున్న 18- 55 ఏళ్ల ట్రాన్స్‌జెండర్లు స్వయం ఉపాధి కోసం జనవరి 10లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా PDPL జిల్లాకు 2 యూనిట్లకు రూ.1,50,000 మంజూరు చేసిందన్నారు. దరఖాస్తులు IDOC రూమ్ నం.114, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. వివరాలకు 994949461, 9440852495లను సంప్రదించవచ్చు.

News December 29, 2025

కామారెడ్డి జిల్లాలో బాంబు కలకలం

image

నాటు బాంబులు పేలి ఓ కుక్క తలపగిలి మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం గర్గుల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాగౌడ్ శనివారం పొలంలో నీళ్లు పారించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో భారీ శబ్దం, పొగ రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క తలపగిలి మృతి చెందింది. అదే సమయంలో పొలంలో జిలిటెన్ స్టిక్స్ ఉండటాన్ని గమనించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.