News February 20, 2025

ఛాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన 

image

మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఈనెల 25 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె బుధవారం ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 30, 2025

మిర్యాలగూడ: చివరి ధాన్యం గింజ వరకూ కొంటా: కలెక్టర్

image

ఈ ఖరీఫ్‌లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని తెలిపారు. రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె అన్నారు.

News October 30, 2025

ధాన్యం తడవకుండా పటిష్ఠ చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

మాడుగులపల్లి: మొంథా తుపాను నేపథ్యంలో వర్షాలకు ధాన్యం తడవకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జులను ఆదేశించారు. గురువారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఆమె మాడుగులపల్లి మండలం చిరుమర్తిలోని ఐకేపీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులతో సమన్వయం చేసుకొని, టార్పాలిన్లు, లారీలు సిద్ధం చేయాలని డీఆర్‌డీఓ శేఖర్‌ రెడ్డికి సూచించారు.

News October 30, 2025

NLG: ధాన్యం తడవడంతో సెంటర్‌ ఇన్‌ఛార్జికి షోకాజ్

image

తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల తుఫాను వర్షాలకు కేంద్రంలోని ధాన్యం తడవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సెంటర్ ఇన్‌ఛార్జికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆమె ఆదేశించారు.