News February 14, 2026

ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక.. బందోబస్తుపై సమీక్ష

image

MHBD మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శనివారం టౌన్ CI మహేందర్ రెడ్డితో కలిసి DSP, RDO, కమిషనర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈనెల 16న జరిగే ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని DSP ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News February 14, 2026

సోమేశ్వరాలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పాలకుర్తి సోమేశ్వరాలయం విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా మెరుస్తోంది. ఆలయ ప్రాంగణం నుంచి రాజీవ్ చౌరస్తా, గుడివాడ చౌరస్తా వరకు మాడ వీధులను రంగురంగుల లైట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సరికొత్త వెలుగులతో పాలకుర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ పరిసరాలు, కొండ ప్రాంతం కాంతులీనుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 14, 2026

16 నుంచి విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విశాఖలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నెల 16న రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకొని బస చేస్తారు. 17న సాయంత్రం విశాఖ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. 18న ఐఎఫ్ఆర్‌లో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలుకి 20న విజయవాడ బయలుదేరుతారు.

News February 14, 2026

విమానంలో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసి..

image

అస్సాం నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసిన పేపర్‌ వాష్‌రూమ్‌లో లభించింది. సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేయడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న షిల్లాంగ్ నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో విమానానికీ బాంబ్ బెదిరింపు వచ్చింది.