News February 19, 2026

జంగంపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి

image

బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ నవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 21, 2026

NLG: మరో వారం రోజులే గడువు

image

ఫార్మర్ రిజిస్ట్రీకి మరోవారం రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

News February 21, 2026

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి ప్రకటన

image

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

News February 21, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>AIIMS<<>> బీబీనగర్‌లో 13జూనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. MBBS అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC,ST,PwBD, మహిళలకు ఫీజు లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in