News February 21, 2026
జంగారెడ్డిగూడెంలో ఏసీబీ ఎటాక్

జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆవుపాడుకి చెందిన అచ్యుత దుర్గ సాయి డ్రగ్ లైసెన్స్ కోసం ఈనెల 6న ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్‌ను సంప్రదించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాప్ అసోసియేషన్ కోశాధికారి తడికమళ్ళ శివరామకృష్ణను కలవాలని చెప్పగా రూ.20,000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం నగదు ఇచ్చే సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 21, 2026
ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 3 రీసెర్చ్ అసోసియేట్, SRF పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాన్ని బట్టి PhD, MTech(లైఫ్ సైన్సెస్), PG(జెనెటిక్స్/ప్లాంట్ బ్రీడింగ్/బయోటెక్నాలజీ/ లైఫ్ సైన్సెస్), NET, GATE అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 12వరకు దరఖాస్తును ఈ మెయిల్ చేయాలి. RAకు గరిష్ఠ వయసు 40ఏళ్లు. SRFకు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.iari.res.in/
News February 21, 2026
కుందేళ్ల షెడ్డు నిర్మిస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి

కుందేళ్ల షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టాలి. షెడ్ పరిసరాల్లో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దాల వల్ల కుందేళ్లు భయపడి వాటి ఉత్పాదక సామర్థ్యం తగ్గే ఛాన్సుంది. షెడ్డు లోపల చల్లని వాతావరణం ఉండాలి. షెడ్డు ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30 డిగ్రీల సెల్సియస్ దాటకుండా.. చలికాలంలో 20 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News February 21, 2026
గురువారం ‘తిరుప్పావడ సేవ’

గురువారం స్వామివారికి అన్ని ఆభరణాలు తొలగించి ధోవతి, ఉత్తరీయాలే ఉంచుతారు. ఈరోజు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నామ పరిమాణాన్ని తగ్గించడం వల్ల ఆ దివ్య నేత్రాలను నేరుగా చూడవచ్చు. దీన్నే నేత్ర దర్శనం అంటారు. బంగారు తొట్టిలో భారీగా పులిహోర నివేదిస్తారు. నామం తీసినప్పుడు స్వామివారి శక్తిమంతమైన చూపు నేరుగా భక్తులపై పడకుండా దీనిపై పడేలా చేస్తారు. అందుకే దీనికి పావడ అని పేరొచ్చింది.


