News November 24, 2025
జంగారెడ్డిగూడెంలో 26న జాబ్ మేళా

జంగారెడ్డిగూడెం సూర్య డిగ్రీ కాలేజీలో ఈనెల 26న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.జితేంద్ర బాబు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌లో 17కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 1140 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలోని 18 సంవత్సరాల వయసు నిండి, 10వ తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.
Similar News
News November 25, 2025
NZB: మూడు విడతల్లో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 545 GPలు, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1,642 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో NZB డివిజన్‌లోని 196 GPలు, 1,760 వార్డులకు, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్‌లోని 12 మండలాల్లో 165 GPలు, 1,620 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
మెదక్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.
News November 25, 2025
మహిళా సాధికారతలో జిల్లా ముందడుగు: కామారెడ్డి కలెక్టర్

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కామారెడ్డి జిల్లా ముందడుగుగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం గాంధారిలో ఆయన స్వయం సహాయక సంఘాలకు రూ.3.78 కోట్ల చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి అందించారు. జిల్లాలో 14,359 సంఘాలకు రూ.789.13 కోట్లు ఆర్థిక లక్ష్యం కాగా, ఇప్పటివరకు 6,971 సంఘాలకు రూ.558.41 కోట్లు విడుదలయ్యాయని కలెక్టర్ తెలిపారు.


