News December 16, 2025
జంగారెడ్డిగూడెం: లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు

జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికపై ఆమె మారుతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ముద్దాయిపై రౌడీ షీట్ కూడా తెరుస్తున్నామని పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Similar News
News December 17, 2025
MNCL: ఎన్నికలకు కట్టుదిట్టమైన బందోబస్తు: సీపీ

మంచిర్యాల జిల్లాలో బుధవారం జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను సైతం సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు.
News December 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 17, 2025
తిరుపతి: వారి సహకారంతోనే.. అంతకుమించి.!

గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ భూములు, డీకేటి భూముల్లో<<18577986>> జీ ప్లస్–2<<>> వరకు మాత్రమే పంచాయతీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై వ్యవహారం నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీ ప్లస్–2 మించి నిర్మాణం చేస్తే పంచాయతీ కార్యదర్శి అడ్డుకుని నోటీసులు జారీ చేయాలి.


