News March 6, 2025

జంగారెడ్డిగూడెం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రాలు

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన గీతకులాల మద్యం షాపుల ఆన్‌లైన్ విధానం వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియడంతో జంగారెడ్డిగూడెం మండలంలో దరఖాస్తులు చేసుకున్న వారందరూ 6వ తేదీ ఉదయం 8. గంటలకు డ్రా ఉంటుందన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి మీటింగ్ హాల్‌లో జరుగు డ్రాలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనుబాబు కోరారు. దరఖాస్తు దారులు అందరూ హాజరు కావాలన్నారు.

Similar News

News December 23, 2025

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత

image

ఆలేరు నియోజకవర్గ నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమం పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరవుతున్న ఈ వేడుక కోసం వైకుంఠ ద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, నిషేధిత ప్రాంతంలో ఫ్లెక్సీలు కట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు వాటిని చింపివేసి నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

News December 23, 2025

విదేశీ చదువుల్లో AP యువతే టాప్

image

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో AP యువత దేశంలోనే టాప్‌లో నిలిచింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 2020లో AP నుంచి 35,614 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, పంజాబ్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో తెలంగాణ టాప్ 10లో లేదు. ఇక 2024లో మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కెనడా, US, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలవైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

News December 23, 2025

ADB: చెప్పులేసుకుంటే రూ.5 వేల జరిమానా

image

పుష్యమాసం ప్రారంభమైంది. ఆదివాసీ గూడెల్లో పుష్యమాసంలో నియమ నిష్ఠలతో ఆదివాసీలు పేన్ దేవతలకు పూజలు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ మేరకు ఇంద్రవెల్లిలోని తుమ్మగూడ గ్రామస్థులు ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరి బయటే విడచి పెట్టాలని, చెప్పులు ధరించి ఊరి లోపలికి వెలితే రూ.5వేల జరిమానా విధిస్తారు. వచ్చే నెల 22 వరకు ఈ ఆంక్షలు ఉంటాయని గ్రామస్థులు తెలిపారు.