News February 9, 2026
జంద్యం ధరిస్తున్నారా?

జంద్యం పొడవు వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇది జాగరణ, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 ఆత్మ స్థితులను సూచిస్తుంది. దీనిని ధరించే విధానంలో 3 రకాలు ఉన్నాయి. శుభ కార్యాల్లో ఎడమ భుజంపై(సవ్యం), అశుభ కార్యాల్లో కుడి భుజంపై(ప్రాచీనావీతి), మలమూత్ర విసర్జన సమయంలో మెడలో దండలా(నివీతం) ధరించాలి. ఏటా శ్రావణ పూర్ణిమ లేదా జంద్యాల పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
Similar News
News February 9, 2026
మున్సి‘పోల్స్’కు ముగిసిన ప్రచారం

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలపై SEC నిషేధం విధించింది. ర్యాలీలు, సభలు, ఊరేగింపులతో పాటు టీవీ, సినిమా, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష/జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
News February 9, 2026
రియల్ ఎస్టేట్.. టైర్-2 సిటీల్లో పెట్టుబడులతో లాభాలు!

టైర్-2 సిటీల్లో రియల్ ఎస్టేట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను పెట్టుబడిదారులు లాభదాయకంగా చూస్తున్నారు. మెట్రో సిటీల కంటే తక్కువ ధరలు, మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్థిరమైన డిమాండ్&రాబడి, ఎక్కువ భూమి అందుబాటులో ఉండటం, పరిశ్రమల వృద్ధి, కనెక్టివిటీ పెరుగుదల వంటివి కారణాలుగా చెబుతున్నారు. RBI క్లాసిఫికేషన్ ప్రకారం 50,000-99,999 మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్-2గా పరిగణిస్తారు.
News February 9, 2026
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


