News February 11, 2025

జక్కాపూర్ పాఠశాల విద్యార్థుల సత్తా

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఫలితాల్లో నారాయణరావుపేట మండలం జక్కపూర్ ZPHS విద్యార్థులు స్తతా చాటారు. జిల్లా మొదటి ర్యాంకుతో పాటు మొత్తం 13 మంది అర్హత సాధించారు. ఒకే పాఠశాల నుంచి ఇంత పెద్ద ఎత్తున అర్హత సాధించడం జిల్లాలోనే మొదటి సారి అని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు.

Similar News

News March 2, 2026

హెజ్బొల్లా పార్లమెంటరీ చీఫ్ హతం!

image

ఇరాన్, దాని మద్దతు గ్రూపులకు ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఖమేనీని హతమార్చిన ఆ దేశం తాజాగా హెజ్బొల్లాను టార్గెట్ చేసింది. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి అడుగుపెట్టిన మిలిటెంట్ గ్రూప్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. లెబనాన్‌లోని స్థావరాలపై చేసిన దాడిలో హెజ్బొల్లా పార్లమెంటరీ చీఫ్ మహమ్మద్ రాద్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. భారీ మూల్యం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

News March 2, 2026

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 40 పోస్టులు.. అప్లై చేశారా?

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ 40 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 10 వరకు పోస్ట్ చేయాలి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో PhD/M.Phil, పీజీ, ME/MTech, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in

News March 2, 2026

హోలికా దహనం ఎప్పుడు నిర్వహించాలంటే?

image

శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిథి ఆధారంగానే హోలికా దహనం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఏడాది పౌర్ణమి మార్చి 2న సాయంత్రమే ప్రారంభమవుతుంది. అందువల్ల ఆ రోజే హోలికా దహనం చేయాలి. నేడు సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 8:50 గంటల వరకు దీనికి శుభ ముహూర్తంగా నిర్ణయించారు’ అని చెబుతున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా ప్రజలు మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి నెగటివ్ శక్తులను దూరం చేసుకుంటారు.