News March 23, 2025

జక్రాన్‌పల్లి: ఇస్టాగ్రాంలో పరిచయం.. యువకుడి అరెస్టు

image

AP రాష్ర్టం ఏలూరు జిల్లాకు చెందిన బాలికకు జక్రాన్​పల్లికి చెందిన ఓ యువకుడు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం అయ్యాడు. మూడు నెలల క్రితం ఆమెను జక్రాన్​పల్లికి తీసుకువచ్చాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. నిందితుడికి జక్రాన్​పల్లి మండలం కలిగోట్​కు చెందిన మరో వ్యక్తి సహకరించాడు.

Similar News

News March 24, 2025

సాలూర: చెరువులో పడి యువకుడు మృతి

image

సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన మోతేవార్ రమేశ్(26) చెరువులో పడి మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డ వివరాలు.. రమేశ్ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తుండగా మార్గమధ్యంలో కాలకృత్యాలు చేసుకొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

News March 23, 2025

నిజామాబాద్‌లో పలువురి ఘర్షణ

image

నిజామాబాద్ నగరంలో ఆదివారం కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగగా కత్తి పోట్లు జరిగాయని పుకార్లు షికార్లు చేశారు. వివరాల్లోకి వెళితే మిర్చి కాంపౌండ్‌లో హబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్‌కు మిర్చీ కాంపౌండ్‌కు చెందిన అజ్జుకు, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో మహమ్మద్‌కు అక్కడ ఉన్న ఓ ఇనుప రాడ్డు గుచ్చుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2025

నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్‌పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్‌పల్లె, మదన్‌పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!