News August 24, 2025

జగదేవపూర్: డెంగీ లక్షణాలతో బాలుడి మృతి

image

డెంగీ లక్షణాలతో బాలుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాయిని మహేందర్ కుమారుడు నాయిని శ్రావణ్ కుమార్(13) డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News August 24, 2025

ఖమ్మం: తగ్గుతున్న పాలేరు జలాశయం నీటి మట్టం

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గింది. నిన్నటి వరకు వరదల కారణంగా పరవళ్లు తొక్కగా, వర్షాలు తగ్గడంతో పాటు సాగర్ డ్యాం నుంచి నీటి రాక తక్కువగా ఉంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి ప్రస్తుతం 19.5 అడుగులకు తగ్గింది.

News August 24, 2025

తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

image

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్‌కు సపోర్ట్ చేసిన అజర్‌బైజాన్‌లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్‌తో పోలిస్తే 60% తగ్గింది.

News August 24, 2025

KNR: బతుకమ్మ కానుకగా మహిళలకు 2 చీరలు..!

image

బతుకమ్మ పండగకు మహిళా పొదుపు సంఘాల సభ్యులకు 2చీరల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.318కోట్లను కేటాయించింది. ఇందిరా మహిళాశక్తి స్కీంలో భాగంగా 65లక్షల చీరల తయారీకి SRCL నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. కాగా, 2.30కోట్ల మీటర్ల వస్త్రంతో 30లక్షల చీరలు ఇప్పటికే పూర్తయ్యాయి. 2షిఫ్టుల్లో 6వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.